బీసీ గురుకులాలను ప్రారంభించిన మంత్రులు

బీసీ గురుకులాలను ప్రారంభించిన మంత్రులు

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 119 గురుకుల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించారు నేతలు.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌, గోషామహల్‌, జూబ్లిహిల్స్‌, ముషీరాబాద్‌లలో నూతన గురుకులాలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్‌అలీ  కొత్తగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు ప్రారంభించారు. గురుకులాల్లో కార్పొరేట్ స్థాయిలో సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు హోంమంత్రి. గురుకులాల్లో మెరుగైన విద్యను అందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

జనగామ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండల కేంద్రంలో జ్యోతి మహాత్మ బాపులే గురుకుల పాఠశాల ప్రారంభ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలను మంత్రి ప్రారంభించారు.

ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు పాఠశాలలను ప్రారంభిస్తున్నారు. జిల్లాలోని శామీర్‌పేటలో బీసీ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ, ఎంపీపీ పాల్గొన్నారు.