
తనని తాను కిడ్నాప్ చేసుకొని సొంత ఫ్యామిలీనే రూ. 50 కోట్లు డిమాండో చేశాడో బాలుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. మీరట్‌కు చెందిన బాలుడు.. తన తండ్రి, సవితి తల్లి, ఇద్దరు సోదరీమణులతో కలిసి నివసిస్తున్నాడు. అయితే బాలుడు సవతి తల్లితో ఇబ్బందులు పడలేక.. తన సోదరీమణులతో కలిసి బయటకు వెళ్లి బతకాలనుకున్నాడు. అందుకోసం డబ్బు కావాలి.. దాంతో కిడ్నాప్ డ్రామాకు శ్రీకారం చుట్టాడు. ప్లాన్ ప్రకారం తనను తానే కిడ్నాప్ చేసుకొని.. ఎవరో కిడ్నాప్ చేసినట్లుగా ఫ్యామిలీకి మెసెజ్ చేశాడు. బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మీరట్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడు మెసెజ్ పంపిన సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు బాలుడి ఆచూకీ కనుగొన్నారు. బాలుడి నుంచి రూ. 9.31 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
మీరట్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ అజయ్ సాహ్ని మాట్లాడుతూ.. ‘బాలుడు ఇంటి నుంచి వెళ్లి వేరుగా ఉండాలనే ఈ పని చేశాడు. ఈ సంఘటన గురించి శిశు సంక్షేమ కమిటీకి సమాచారం ఇచ్చాం. బాలుడిని కోర్టులో హాజరుపరుస్తాం. బాలుడి తండ్రిని కూడా ఈ విషయం గురించి ప్రశ్నిస్తున్నాం’ అని ఆయన అన్నారు.
For More News..