ఖమ్మం: రాష్ట్రంలో కమ్మ కులస్తులందరూ ఐక్యంగా ఉండాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించిన ఆయన.. కమ్మ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయాలని కోరారు. చిన్న విషయాలకు కొందరు రాద్దాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన మంత్రులపై కొందరు కుట్రలు పన్నుతున్నారని మంత్రి ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో తానొక్కడినే కమ్మ మంత్రినన్న పువ్వాడ.. కావాలనే కొంతమంది తనపై నిందలు మోపి కుట్రలు పన్నుతున్నారని చెప్పారు.
