పోషకాలను పెంచే పుదీనా..

పోషకాలను పెంచే పుదీనా..

ఘాటైన వాసనతో.. వంటల రుచిని  పెంచే పుదీనా ఆకులతో  చాలా లాభాలున్నాయి. వీటిని  డైలీ డైట్​లో చేర్చితో బోలెడు ఆరోగ్య సమస్యలకు గుడ్​ బై చెప్పొచ్చు.

పుదీనా ఆకుల్లో విటమిన్​ –ఎ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల  కంటి సమస్యలు దరిచేరవు. నైట్ విజన్​ పెరుగుతుంది.  పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్​లు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే కొద్ది మొత్తంలో అయినా వీటిని తరచూ తినాలి.

పుదీనా జీర్ణవ్యవస్థ పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది. డైజెస్టివ్ ట్రాక్​ డిజార్డర్​ వల్ల వచ్చే  కడుపు నొప్పి, మంటను తగ్గిస్తుంది. రెండు స్పూన్​ల  పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి.

పుదీనాలో  పీచు , విటమిన్‌‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బీటా కెరోటిన్, విటమిన్‌‌–సి, విటమిన్‌‌–ఇ, విటమిన్‌‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌‌  వంటి మినరల్స్​ పుష్కలంగా ఉంటాయి.

పుదీనా శరీర వేడిని కూడా తగ్గిస్తుంది. పుదీనా రసంలో శొంఠి, జీలకర్ర పొడి వేసి భోజనానికి ముందు తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. ఈ రసంలో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. వాము పొడి కలిపి తాగితే కడుపులో నులి పురుగులు ఉంటే చచ్చిపోతాయి. దీంతో రక్తంలోని హిమోగ్లోబిన్‌‌ స్థాయి పెరుగుతుంది. పుదీనాలో ఉండే సల్ఫర్‌‌ ఊపిరితిత్తులకు రక్షణనిస్తుంది. చర్మవ్యాధులు రాకుండా కాపాడుతుంది.

పుదీనా ఆకుల్లో యాంటీఆక్సిడెంట్స్, రోస్ మాలిక్​ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది . ఈ యాసిడ్స్ సీజనల్ గా వచ్చే అలర్జీలను నివారిస్తాయి. దగ్గు , జలుబు, ఫ్లూ జ్వరం లాంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. అందుకే గొంతులో గరగర లాంటి  ఇబ్బందులొస్తే  కప్పు పుదీనా చాయ్ తాగితే  నిమిషాల్లో గొంతు ఫ్రీ అవుతుంది. ఒక్క కప్పు పుదీనా టీని రోజూ తీసుకుంటే  వీటిలోని విట‌‌మిన్ ఎ, సిలు శ‌‌రీర వ్యాధి నిరోధ‌‌క శ‌‌క్తిని పెంచుతాయి. ఉదయాన్నే ఒక కప్పు పుదీనా టీని తాగితే దాని ద్వారా శరీర పనితీరు  కూడా మెరుగు ప‌‌డుతుంది.

పుదీనా ఆకుల్ని రోజూ తీసుకుంటే అవి  రోజంతా మ‌‌న‌‌ల్ని యాక్టివ్‌‌గా ఉంచుతాయి. ఉత్సాహంగా ప‌‌నిచేసేలా చేస్తాయి.  డిప్రెష‌‌న్, మాన‌‌సిక ఆందోళ‌‌న‌‌, ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి.

గర్భిణీలకు అవసరం అయిన ఫోలిక్ యాసిడ్‌‌, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుదీనాలో కావాల్సినంత దొరుకుతాయి. ఇవి గ‌‌ర్భిణీ స్త్రీకే కాదు, ఆమె క‌‌డుపులో ఉన్న శిశువు ఎదుగుద‌‌ల‌‌కు కూడా ఉప‌‌యోగ‌‌ప‌‌డ‌‌తాయి. అందుకే గర్భిణీలు తరచూ ఏదో ఒక రూపంలో పుదీనా ఆకుల్ని తీసుకోవాలి.

పుదీనా ఆకుల్ని డైలీ డైట్​లో చేర్చితే శ‌‌రీరంలో క‌‌ణుతులు పెర‌‌గ‌‌కుండా ఉంటాయి. పలు రకాల క్యాన్సర్లు కూడా దరిచేరవు.

For More News..

నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి