AI సృష్టిస్తున్న అద్భుతాలు : వర్షాలు, వరదల్లో మీ వాహనాలు ఇలా ఉంటే..

AI సృష్టిస్తున్న అద్భుతాలు : వర్షాలు, వరదల్లో మీ వాహనాలు ఇలా ఉంటే..

బండిపై వెళుతున్నారు వర్షం వచ్చింది.. వెంటనే రోడ్డు పక్కన ఆగుతాం.. వరద వచ్చింది మీ బైక్, కారు పని చేయదు.. అప్పుడు కావాల్సింది పడవ.. రోడ్లపై వరద ప్రవాహం ఉంది.. కారు ఉన్నా ముందుకు కదలలేరు.. వర్షాలు, వరదలు వచ్చినా మీరు హాయిగా, హ్యాపీగా రోడ్లపై తిరుగుతూ మీ పనులు చక్కబెట్టుకోవాలి అనుకుంటున్నారా.. మీలాంటి వారికే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. AI అద్భుతమైన వాహనాలను సృష్టించింది. అవి ఎలాగున్నాయో చూద్దాం..

మీరు బైక్ లో వెళుతున్నారు.. సడెన్ గా వర్షం వచ్చింది. వర్షం పడగానే.. మీ బైక్ కు ఉన్న బెలూన్.. గ్లోబ్ ఆకారంలో ఓపెన్ అవుతుంది..  కారుకు యాక్సిడెంట్ జరిగినప్పుడు బెలూన్స్ ఓపెన్ అయినట్లే.. మీ బైక్ బెలూన్ ఓపెన్ అయ్యి.. మిమ్మల్ని వర్షంలో తడవకుండా రక్షిస్తుంది. జర్నీ హ్యాపీగా సాగేలా చేస్తుంది. 

ఇక మీరు ఆటోలో వెళుతున్నారా.. వరద వచ్చేసింది. ఆటో కదలకుండా అక్కడే ఆగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన అద్భుతం ఏంటో తెలుసా.. వరద రాగానే మీ ఆటో బోటుగా మారిపోతుంది. ఆటో కింద భాగం అంతా బోటు తరహాలో మారి.. మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేర్చుతుంది.

మీరు వరదలో చిక్కుకుపోయారు.. మీ సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలి.. అలాంటి సమయంలో మీ కోసం ఓ పడవ వస్తుంది.. రెగ్యులర్ గా చూసే నాటు పడవ కాదు అది.. మోడ్రన్ వెహికల్ గా ఉండి.. హాలీవుడ్ సినిమాలో చూపించినట్లు.. హెలికాఫ్టర్ తరహాలో బోటు మీ దగ్గరకు వచ్చేస్తుంది. 

ఇలాంటి మోడ్రన్ టెక్నాలజీ వెహికల్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటివిటీ అని లైట్ గా తీసుకోవద్దు.. మనం సినిమాల్లో చూసే ఎన్నో వింతలు, విడ్డూరాలు ఇప్పుడు నిజం అయినట్లే.. రేపు ఇలాంటివి కూడా మన కళ్ల ముందు ప్రత్యక్షం కావొచ్చు. మనిషిని మించి.. మనిషి ఆలోచనలను మించి అద్భుతాలు సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేటివిటీ ఇప్పుడు ప్రపంచాన్ని మార్చేయబోతుంది.. మార్చేయటం కూడా షూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. దాని సంకేతాలు ఇప్పుడు కనిపిస్తూనే ఉన్నాయి..