రాసిపెట్టి ఉంటే.. 70 ఏళ్ల వృద్ధుడి మీద నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ తో రైలు

రాసిపెట్టి ఉంటే.. 70 ఏళ్ల వృద్ధుడి మీద నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ తో రైలు

ఈ వృద్దుడికి ఇంకా భూమ్మిద నూకలు ఉన్నాయి. ఇంకా బతకాలని రాసి పెట్టి ఉుందంటున్నారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు..అందుకే వేగంగా వెళ్తున్న రైలు మీదనుంచి పోయినా బతికి ఉన్నాడు..అతని ధైర్యమే అతని మరణాన్ని దూరం చేసిందని జోస్యం చెబుతున్నారు. వృద్దుడు రెండు పట్టాల మధ్య పడుకొని ఉండగా.. తనపైనుంచి గూడ్స్ రైలు వేగంగా వెళ్తున్న దృశ్యాల కు సంబంధించిన వీడియో చూసి.. అతను బయటపడ్డ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 

మధ్యప్రదేశ్ లోని గుణ రైల్వే స్టేషన్ ప్రాంతం అది. గురువారం మధ్యాహ్నం (డిసెంబర్ 1) ఈ ఘటన చోటు చేసుకుంది. 70 ఏళ్ల వృద్దుడు పట్టాలపై ఉండగా గూడ్స్ రైలు అతనిపై నుంచి దూసుకెళ్లింది. అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. దాదాపు ఆ వృద్దుడు చనిపోయి ఉంటాడని భావించారు. మూడు నిమిషాలపాటు ఉత్కంఠగా చూశారు. చివరికి అతడు ప్రాణాలతో లేచి నిలబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. 

ఆ వృద్ధుడు .. గుణ స్టేషన్ కు సమీపంలోని బస్తీలో నివాసముంటున్నాడు.. అతనికి ఎవరూ లేకపోవడంతో.. ఆత్మ హత్య చేసుకోవాలని నిర్ణయించుకుని రైలు పట్టాలపై పడుకున్నాడని రైల్వే పోలీసులు తెలిపారు.. రైలు తనవైపు దూసుకు వస్తుండగా చివర క్షణంలో మనసు మార్చుకొని పట్టాల మధ్యలో పడుకొని తన ప్రాణాలు రక్షించుకున్నాడని తెలిపారు. గూడ్స్ రైలు దాటిన తర్వాత రైల్వే అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని మందలించి అక్కడి నుంచి పంపించారు.