
రూట్ మ్యాప్ లు ఎప్పుడు ఎవర్ని ఎక్కడ పడేస్తాయో.. ఎక్కడ ముంచేస్తాయో అర్థం కాని పరిస్థితి. ఎక్కడికెళ్లాలన్నా.. రూట్ తెలియకపోతేనేం.. గూగుల్ మ్యాప్ ఉంది కదా అనే ధీమాలో వెళ్లే వారికి షాకుల మీద షాక్ లు ఇస్తున్నాయి రూట్ మ్యాప్ యాప్ లు. మొన్నామధ్య ఉత్తరప్రదేశ్ లో గూగుల్ మ్యాప్ ను నమ్మి బ్రిడ్జిపై వేగంగా వెళ్లి.. కారు బ్రిడిజైనుంచి పడిపోవడంతో ముగ్గురు చనిపోయారు. ఇటీవల హైదరాబాద్ టూరిస్ట్ కారు గూగుల్ మ్యాప్ ను నమ్మి కేరళలో ఓ పెద్ద గుంతలో పడిపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ మరువక ముందే ముంబైలో జరిగిన మరో ఘటన సంచలనంగా మారింది.
శుక్రవారం (జులై 25) నవీ ముంబైలో ఓ మహిళ గూగుల్ మ్యాప్ ను నమ్మి కారుతో సహా నీళ్ల గుంతలో పడిపోయింది. పొద్దుపొద్దున్నే మ్యాప్ ఆన్ చేసుకుని బయల్దేరిన మహిళ.. ఒక్కసారిగా నీటి గుంతలో పడిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేసింది. నవీ ముంబై లోని బేలాపూర్ టు ఉల్వే రూట్ లో జరిగింది ఈ షాకింగ్ ఇన్సిడెంట్.
బేలాపూర్ లోని సముద్ర తీర బ్రిడ్జికి వెళ్లాల్సిన మహిళను మ్యాప్ బ్రిడ్జికిందంగా చూపిస్తూ ధృవతార జెట్టీ రూట్ లో చివరికి నీళ్లల్లోకి తీసుకెళ్లింది. రూట్ తెలియకపోవడంతో మ్యాప్ ను అనుసరించిన మహిళ చివరికి నీళ్లలో పడిపోయింది.
ALSO READ : భారీ వర్షాలు.. జిల్లాలకు రూ. 33 కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం
సమీపంలో ఉన్న సముద్ర భద్రతా అధికారులు.. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడ మహిళ నీళ్లలో తేలియాడుతుండటం చూసి ముందుగా ఆమెను కాపాడారు. ఆ తర్వాత క్రేన్ ల సహాయంతో కార్ ను బయటకు తీశారు. ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. నీళ్ల గుంతలో పడిన వైట్ కార్ ను క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్న విజువల్స్ వీడియోలో చూడవచ్చు.
గూగుల్ మ్యాప్ ను నమ్ముకుని ప్రమాదాలు జరగటం ఇది మొదటిసారి కాదు. ఆ మధ్య ఉత్తరప్రదేశ్ లో మ్యాప్స్ ఆధారంగా నిర్మాణం పూర్తి కాని బ్రిడ్జిపైకి వెళ్లి నీళ్లలో పడిపోయారు. బదౌన్ జిల్లాలో బరేలీ నుంచి దాతగంజ్ వెళ్తుండగా జరిగింది ఆ ప్రమాదం. హైదరాబాద్ టూరిస్టులు కూడా అలాంటి ప్రమాదంలోనే కేరళలో పడిపోయారు. ప్రమాదానికి చింతిస్తున్నాం.. మరింత కచ్చితంగా మ్యాప్ ను తయారు చేస్తామనిగూగుల్ సంస్థ చెబుతున్నప్పటికీ తరచుగా ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.
గూగుల్ మ్యాప్స్ ఉపయోగించేవారికి నిపుణుల సూచనలు:
తరచుగా ప్రమాదాలు జరుగుతున్న క్రమంలో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించేవారికి టెక్ నిపుణులు కీలక సూచనలు చేశారు. గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ నమ్మకుండా కొన్ని టిప్స్‌తో గూగుల్ మ్యాప్ వల్లే జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం మరీ మనం కూడా.
1. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్స్ మ్యాప్స్‌ని అప్డేట్ చేసుకోండి. గడువు ముగిసిన మ్యాప్‌లు కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని సూచిస్తాయి. కాబట్టి.. ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్స్‌ను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. కంపెనీ తీసుకొచ్చే లేటేస్ట్ ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా మ్యాప్స్ సరైన లక్ష్యాన్ని సూచిస్తాయి.
2. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే సమయంలో మనం వెళ్లాల్సిన రూట్ స్పష్టంగా అర్థం కాకపోతే వెంటనే స్థానికులను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మ్యాప్ ఎప్పుడు ప్రస్తుత రహదారి పరిస్థితులను సూచించకపోవచ్చు.