
తెలంగాణలో గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు,వరదలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా జిల్లాలకు నిధులు విడుదల చేసింది. ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున 33 జిల్లాలకు రూ.33 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ప్రజలను అప్రమత్తం చేయడం ..అత్యవసర సాయం చేయడం కోసం డిజాస్టర్ మేనేజ్ మెంట్ కు నిధులు రిలీజ్ చేసింది.
గత మూడు రోజులుగా తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ALSO READ | సామాజిక న్యాయానికి చాంపియన్ కాంగ్రెస్ పార్టీ : పొన్నం ప్రభాకర్
జగిత్యాల ,జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్,ములుగు,నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్,హన్మకొండ జిల్లాల్లో మరో రెండు మూడు గంటల్లో గంటకు 40 కి.మీ వేగంతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలంతా అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించింది.