
హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. శనివారం (మే10) సాయంత్రం గచ్చిబౌలీ స్టేడియంలో మిస్ వరల్డ్ 2025 72వ ఎడిషన్ అందాల పోటీల కోలాహలం మొదలయ్యింది. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రం ఆథిత్యం వహిస్తుండగా.. మే 10 నుంచి 31 వరకు హైదరాబాద్ వేదికగా జరగనున్న ఈ వేడుకను ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ పోటీల్లో 120 పైగా దేశాల అందగత్తెలు, ప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రాండ్ ఓపెనింగ్
శనివారం సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు. వివిధ దేశాల ప్రతినిధులతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితర అధికారులు ఈ కార్యక్రమాలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతంతో ఈవెంట్ ని ప్రారంభించారు.ఆ తర్వాత దాదాపు 250 మంది కళాకారులు తెలంగాణ సాంప్రదాయ నృత్య పేరిణి ప్రదర్శించారు. అనంతరం వివిధ దేశాల అందగత్తెలు తమ ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ లో ర్యాంప్ వాక్ చేస్తూ అలరించారు. ఈ పోటీలో భారతదేశం తరఫున నందిని గుప్తా, నికితా పోర్వాల్ పాల్గొంటున్నారు.
►ALSO READ | హైదరాబాద్ సిటీలో టపాసులు కాల్చటంపై నిషేధం : పొరపాటున కాల్చినా.. సీరియస్ గా జైల్లో వేస్తారు..!
దాదాపు 20 రోజుల పాటు మిస్ వరల్డ్ పోటీల కార్యక్రమాలు జరుగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా అందగత్తెలు పోటీలో పాల్గొనడంతో పాటు రాష్ట్రంలోని వివిధ చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలను సందర్శించనున్నారు. ఈ పోటీల ద్వారా తెలంగాణ రాష్ట్రం సంస్కృతి, వారసత్వం, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫైనల్ మే 31, 2025న హైదరాబాద్లోని హైటెక్స్ సెంటర్లో జరగనుంది.