
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మర్రిలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ సందడి చేశారు.సుమారు 750 సంవత్సరాల చరిత్ర గల పిల్లల మర్రి చెట్టు చరిత్రని గైడ్స్ వివరించారు. పిల్లల మర్రి చెట్టు దగ్గర ఏర్పాటు పోతరాజు, బోనాలు ఆకట్టుకున్నాయి. 22 మంది కంటెస్టెంట్స్ రెండు గ్రూపులుగా విడిపోయి టూరిస్ట్ ప్లేసులను సందర్శించారు. తెలంగాణ చరిత్రను తెలిపే శిల్పాలను పరిశీలించారు. పురావస్తు మ్యూజియాన్ని, రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు అందాల భామలు.
మే 17న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే ఉండనుంది. మే 17న తెలంగాణ ఎక్స్ పీరియం ఎకో టూరిజం పార్క్ సందర్శన, తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, కల్చరల్ ఈవెంట్. మే 19న కంటెస్టెంట్ల స్టేట్ సెక్రటేరియట్ టూర్, ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ విజిట్. మే 20, 21న టీ హబ్ ఆధ్వర్యంలో కాంటినెంటల్ ఫినాలే. మే 21న శిల్పారామంలో కంటెస్టెంట్ల ఆర్ట్స్, క్రాఫ్ట్స్ సెషన్ ఉంటుంది.
►ALSO READ | సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానమాచరించిన డిప్యూటీ CM భట్టి దంపతులు
తెలంగాణ వైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించడం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం, ఇక్కడి పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్నది. మిస్వరల్డ్పోటీలకు మొత్తం రూ.54 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో సగం అంటే రూ.27 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా సగం ఈవెంట్ నిర్వాహకులు వెచ్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చే రూ.27 కోట్లలో కేవలం రూ.5 కోట్లను మాత్రమే నేరుగా భరిస్తుంది. మిగిలిన రూ.22 కోట్లను స్పాన్సర్ల ద్వారా సమకూర్చుకునేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తుండటం గమనార్హం.