ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్ ను గెలిపిస్తాయి :నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి

ప్రభుత్వ పథకాలే కాంగ్రెస్ ను గెలిపిస్తాయి :నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
  •     నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి

గద్వాల, వెలుగు: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని ఎంపీ మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం గద్వాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఎన్నికల ఇన్ ఛార్జి రాములు నాయక్, డీసీసీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రూ. 7 లక్షల కోట్ల అప్పుల వల్ల నెలకు రూ. 6 వేలు కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తున్నా, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.  

అయిజ : అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అఖండ విజయం సాధిస్తుందని ఎంపీ మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి షక్షావలి ఆచారితో కలిసి అయిజలోని పలు కాలనీల్లో ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు.