- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
- కాంగ్రెస్‌లో ఉండి ఇతర గుర్తుపై పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థులపై సస్పెన్షన్వేటు
పెబ్బేరు, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చిందని, అందులో వనపర్తి నియోజకవర్గానికి 32 వేల కార్డులు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం పెబ్బేరు పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో డీసీసీ ప్రెసిడెంట్శివసేనా రెడ్డితో కలిసి పాల్గొన్నారు. అంబేద్కర్ కాలనీలోని కర్రెమ్మ గుడి నుంచి వనపర్తి రోడ్ మీదుగా సుభాష్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వరకు వెళ్లి సుభాష్ చౌక్‌కు చేరుకొని కార్నర్ మీటింగులో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పారు.
12 వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, వెంటనే వార్డుకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు. డీసీసీ ప్రెసిడెంట్శివసేనారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీలో ఉండి వాళ్లకు చెప్పినా తీరు మార్చుకోనందున గౌని బుచ్చా రెడ్డి, జయశ్రీ, సురేశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
