
మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడంతో హైదరాబాద్ కేరాఫ్ అట్రాక్షన్‌గా మారిపోయింది. అయితే.. మన కల్చర్, చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రకరకాల ఈవెంట్స్ ప్లాన్ చేసింది. అందులో భాగంగానే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శనివారం స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించారు. 109 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ యోగాతోపాటు మొత్తం పది విభాగాల్లో జరిగిన స్పోర్ట్స్‌లో పాల్గొన్నారు. దీనిద్వారా యువతరం ఫిట్‌గా ఉండాలనే సందేశం ఇచ్చారు. కార్యక్రమం చివరలో డాన్స్ చేసి యువతలో ఉత్సాహాన్ని నింపారు.