
మరోసారి మిషన్ భగీరథ పైపు లైన్ లీకైంది. నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ మండలం అంకాపూర్ గ్రామశివారులో ఈ రోజు పైపులైన్ పగిలి నీరంతా వృధాగా పోతోంది. పెద్ద ఎత్తున నీరు పైకి ఎగజిమ్ముతోంది. పంట చేల మధ్యలో ఉన్న మిషన్ భగీరథ పైపులైన్ పగిలిపోవడంతో చేనంతా చిన్న సైజు చెరువును తలపిస్తోంది. ఆర్గుల్ నుండి నిజామాబాద్ వెళ్లే లైన్ ధ్వంసమైందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇంతకు ముందు కూడా ఆదిలాబాద్, తాండూర్, నాగర్ కర్నూల్ మొదలగు జిల్లాల్లో పైపులైన్ పగిలి నీరంతా వృథాగా పోయింది.