ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల పరిధిలోని ముప్పారం గ్రామానికి ఇటీవల డీఎంఎఫ్ఎల్ కింద మంజూరైన రూ.3 లక్షల విలువైన పనులు పూర్తయినట్లు సర్పంచ్ గుంటిపల్లి రేణుక తెలిపారు. 15 రోజుల నుంచి కొనసాగుతున్న మిషన్ భగీరథ పైప్ లైన్మరమ్మతులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు పునరుద్ధరించే పనులను సోమవారం సర్పంచ్ పాలకవర్గంతో కలిసి పరిశీలించారు.
గ్రామంలో ప్రతి ఇంటికి మిషిన్ భగీరథ కింద ఆరోగ్యకరమైన నల్లా నీటిని అందిస్తున్నామని, తాగునీటి ఎద్దడి నివారణ కోసం 8 చేతిపంపులకు మరమ్మతు పూర్తి చేసి తాగునీరు సరఫరా చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి కుమారస్వామి గౌడ్, వార్డు సభ్యులు శ్వేతా సాగర్, మల్లయ్య, రాజేశ్, యాదగిరి, కాంగ్రెస్ నాయకులున్నారు.
