కమిటీ ఆఫ్​ ఇంజినీర్స్​లో మార్పులు ..సవరణ ఉత్తర్వులు జారీ

కమిటీ ఆఫ్​ ఇంజినీర్స్​లో మార్పులు ..సవరణ ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​(మిషన్​కాకతీయ) కమిటీ ఆఫ్​ ఇంజినీర్స్​లో మార్పులు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మైనర్​ఇరిగేషన్​ సీఈ కమిటీకి చైర్మన్​గా ఉండగా.. డిపార్ట్​మెంట్ రీ ఆర్గనైజేషన్​ తర్వాత ఆ వింగ్​లేకుండా పోయింది. దీంతో కమిటీ చైర్మన్​గా ఆపరేషన్స్​అండ్​మెయింటనెన్స్​ఈఎన్సీని నియమించారు. గతంలో కమిటీ సభ్యుడిగా రోడ్స్​ వింగ్​ సీఈ ఉండగా ఇప్పుడు స్టేట్​ రోడ్స్​ ఈఎన్సీని నియమించారు. ఇరిగేషన్​ డీసీఈ – 2 కమిటీకి సెక్రటరీగా ఉండగా, ఓ అండ్​ఎం ఈఈని నియమించారు. గతంలో సదరన్  రైల్వేస్ – చెన్నై, ఈస్ట్​కోస్ట్ ​రైల్వేస్ – భువనేశ్వర్​కు చెందిన ఇంజినీర్లు సభ్యులుగా ఉండగా.. వారి స్థానంలో హైదరాబాద్​మెట్రో వాటర్, సీవరేజీ​ బోర్డు​ డైరెక్టర్, మిషన్​ భగీరథ సీఈలను నియమించారు. కమిటీలో మిగతా సభ్యులుగా పబ్లిక్​ హెల్త్​ సీఈ, సౌత్​ సెంట్రల్ ​రైల్వే – సికింద్రాబాద్, సౌత్​ వెస్ట్రన్​ రైల్వే – హుబ్లీ నుంచి ఇంజినీర్లు ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కమిటీ రీ కన్​స్ట్రక్షన్

గ్రౌండ్​ వాటర్ ​డిపార్ట్​మెంట్​కు అవసరమైన ఔట్​సోర్సింగ్ ​మ్యాన్​పవర్​ఏజెన్సీ ఎంపిక కమిటీని పునర్వ్యస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి గ్రౌండ్​ వాటర్​ డిపార్ట్​మెంట్ ​డైరెక్టర్​ చైర్మన్​గా వ్యవహరిస్తారు. ఇద్దరు డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. అడ్మినిస్ట్రేటివ్​ వ్యవహారాలు పర్యవేక్షించే డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్​డైరెక్టర్, అడ్మినిస్ట్రేటివ్​ఆఫీసర్లలో ఒకరు మెంబర్​ కన్వీనర్​గా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.