సుందరాంగులతో కళకళలాడుతున్న హైదరాబాద్​.. భాగ్యనగరంలో అందాల భామలు

సుందరాంగులతో కళకళలాడుతున్న హైదరాబాద్​.. భాగ్యనగరంలో అందాల భామలు

మిస్​ వరల్డ్​ పోటీలకు  హైదరాబాద్​  సిద్దమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీనుంచి  హైదరాబాద్​ లో మిస్​ వరల్డ్​ పోటీలు ప్రారంభం కానున్నాయి. ప్రపంచ సుందరాంగులతో భాగ్యనగరం కళకళలాడుతోంది. అందాలభామలు హైదరాబాద్​ చేరుకుంటున్నారు.  పోటీలో పాల్గొనే అందగత్తెలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారతీయ, తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. 

వివిధ దేశాల మిస్ వరల్డ్ పోటీ దారులు హైదరాబాద్ చేరుకుంటున్నారు.  ఇప్పటికే పలు దేశాల సుందరాంగులు హైదరాబాద్​ లో హల్​చల్ చేస్తున్నారు.   తాజాగా నేపాల్​, బ్రెజిల్​, మలేషియా, కాంబోడియా, చైనా, గ్రేస్​, తునీషియా, లెబనాన్​.. ఇంకా పలు దేశాల ప్రతినిథులు హైదరాబాద్​ చేరుకున్నారు. భాగ్యనగరంలో అడుగుపెడుతున్న సుందరీమణులకు తెలంగాణ ప్రభుత్వం సంప్రదాయబద్ధంగా స్వాగతం చెబుతోంది  పటిష్ట భద్రత కల్పిస్తుంది.

మిస్ వరల్డ్ పోటీల సందర్భంగా హైదరాబాద్ నగరం ముస్తాబైంది. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న హైదరాబాద్ వెలుగులు విరజిమ్ముతుంది. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో నగరంలోని ప్రాంతాలను ముస్తాబు చేశారు. రాత్రిళ్లు వెలుగులు విరజిమ్మేలా లైటింగ్ ఏర్పాటు చేశారు.ఈ నెల 10 న గచ్చిబౌలి ఇండోర్​ స్టేడియంలో మిస్​ వరల్డ్​ పోటీలు ప్రారంభంకాగా.. 31 న హైటెక్స్​ లో గ్రాండ్​ ఫినాలేతో ముగుస్తాయి. అదే రోజు విజేతను ప్రకటిస్తారు.  ప్రపంచ  సుందరాంగి.. జూన్​ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.