కరోనా బులిటెన్‌లో తప్పులు…అధికారులపై హైకోర్టు ఆగ్రహం

కరోనా బులిటెన్‌లో తప్పులు…అధికారులపై హైకోర్టు ఆగ్రహం

తెలంగాణాలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో  ఇవాళ(మంగళవారం, జులై-28) కూడా విచారణ జరిగింది.  చీఫ్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిహెచ్ఎంవో, జిహెచ్ఎంసి కమిషనర్ హాజరయ్యారు. టెస్టులు, ఆస్పత్రుల్లో చికిత్స సహా పలు పిటిషన్లపై  హైకోర్టు ఏక కాలంలో విచారణ జరిపింది. హైదరాబాద్ నుండి మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందని.. మారు మూల ప్రాంతాల్లో కూడా వైరస్ సోకి ప్రజలు చనిపోతున్నారని…కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలేంటని హైకోర్టు ప్రశ్నించింది.  ఇతర రాష్ట్రాల్లో టెస్టులు భారీగా చేస్తున్నా.. తెలంగాణలో ఎందుకు తక్కువగా చేస్తున్నారని అడిగింది. డబ్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే మూడున్నర లక్షలకు పైగానే టెస్టులు చేశామని సీఎస్ కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులపై  కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సీజన్ అందక 38 మంది చనిపోయారన్న కోర్టు…పాజిటివ్ కేసులు పెరుగుతున్నా.. నివారణ, నియంత్రణ ఎందుకు చేపట్లేదని అధికారులు ప్రశ్నించింది. కరోనా బులిటెన్‌లో తప్పుల తడకలేంటి అంటూ అధికారులను కోర్టు ప్రశ్నించింది. తమ ఆదేశాలను ఎందుకు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.