మా పనైపోలేదు.. రాజ్‌కోట్ వన్డేలో మేమేంటో చూపిస్తాం: ఆసీస్ స్టార్ బౌలర్

మా పనైపోలేదు.. రాజ్‌కోట్ వన్డేలో మేమేంటో చూపిస్తాం: ఆసీస్ స్టార్ బౌలర్

వరల్డ్ కప్ కి ముందు ఆస్ట్రేలియా జట్టుని పరాజయాలు వెంటాడుతున్నాయి. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో భాగంగా చివరి మూడు వన్డేలు ఓడిన కంగారూల జట్టు స్వదేశంలో భారత్ పై వరుసగా రెండు వన్డేలు ఓడి సిరీస్ చేజార్చుకుంది. అయితే ఐదు సార్లు ఛాంపియన్ జట్టయిన ఆసీస్ టీంని తక్కువగా అంచనా వేస్తే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. ఇదే విషయాన్ని ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ తెలియజేశాడు. 

భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే నేడు రాజ్‌కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల స్టార్ ఆటగాళ్లు ఈ మ్యాచులో బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ బౌలర్ స్టార్క్.. ఈ మ్యాచులో భారత్ పై గెలిచి వరల్డ్ కప్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతాం అని చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ కి ఆత్మవిశ్వాసంతో అడుగుపెట్టాలంటే ఈ మ్యాచులో మేము గెలవడం చాలా కీలకం అని ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ తెలియజేశాడు. స్టార్క్ తో పాటు మ్యాక్స్ వెల్, కమ్మిన్స్, మిచెల్ మార్ష్ ఈ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారు. 

Also Read : 19 ఏళ్లకే యువీ, రోహిత్ ఆల్‌టైం రికార్డ్ బద్దలు.. ఎవరీ కుషాల్ మల్లా

కాగా.. స్టార్క్ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్ తో పాటు భారత్ తో జరిగిన తొలి రెండు వన్డేలకు దూరం అయ్యాడు. స్టార్క్ లేని ఆసీస్ జట్టు బౌలింగ్ లో చాలా బలహీనంగా కనిపించగా.. ఈ పేస్ బౌలర్ రాకతో కంగారూల జట్టు బలంగా కనిపిస్తుంది. మరి స్టార్ ఆటగాళ్లతో నిండిపోయిన రాజ్ కోట్ వన్డేలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.