
బెంగళూరు: విమెన్స్ క్రికెట్‌లో స్టార్ ప్లేయర్ మిథాలీ రాజ్ ప్లేస్‌ను ఎవ్వరూ భర్తీ చేయలేరని ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పింది. మహిళల క్రికెట్‌కు మిథాలీ ఎంతో సేవ చేసిందని కొనియాడింది. ‘విమెన్స్ క్రికెట్‌లో మిథాలీ లెజెండ్. ఆమె స్థానం చాలా గొప్పది. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. మా డ్రెస్సింగ్ రూమ్‌లో ఆమెను మాత్రం కోల్పోతున్నాం. ఇప్పటివరకు ఆమెతో గడిపిన క్షణాలు ఓ జ్ఞాపకంగా మిగిలిపోతున్నాయి’ అని కౌర్ పేర్కొంది. ఈనెల 23 నుంచి జరిగే మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం శ్రీలంక బయల్దేరే ముందు హర్మన్ శనివారం మీడియాతో మాట్లాడింది. వన్డేల్లో 300 స్కోరు కోసం తాము చాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. వరల్డ్‌కప్ సమయంలో 270, 280 వరకు రాగలిగామని, రాబోయే రోజుల్లో 300 చేరుకుంటామని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. లంకతో తొలి టీ20లో ఎలాంటి కాంబినేషన్‌తో ఆడాలో నిర్ణయించుకోలేదని, ప్రతి ప్లేయర్‌కు చాన్స్ వస్తుందో లేదో కూడా చెప్పలేమని హర్మన్ వ్యాఖ్యానించింది.