
న్యూఢిల్లీ: తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు ఇండియా విమెన్స్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ చెక్ పెట్టింది. ఈనెల 18 నుంచి జరిగే సీనియర్ విమెన్స్ టీ20 ట్రోఫీలో రైల్వేస్ తరఫున ఆమె పోటీ పడనుంది. గత నెల వన్డే వరల్డ్ కప్‌లో పరాజయం తర్వాత మిథాలీతో పాటు మరో వెటరన్ పేసర్ జులన్ గోస్వామి ఇంటర్నేషనల్ కెరీర్ ముగిసినట్టేనని, తొందర్లోనే ఈ ఇద్దరూ ఆటకు వీడ్కోలు ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, మిథాలీ సీనియర్ విమెన్స్ టోర్నీకి రెడీ అవడంతో ఈ ప్రచారానికి ప్రస్తుతం తెరపడింది. ఆమెతో పాటు వరల్డ్‌కప్‌లో ఆడిన ఇండియా ప్లేయర్లంతా ఆరు వేదికల్లో జరిగే ఈ టోర్నీలో పోటీ పడుతున్నారు. ఇందులో టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా ఉంది.