హాస్పిటల్ లో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తిని తిట్టిన మోదీ

హాస్పిటల్ లో ఉన్నప్పుడు మిథున్ చక్రవర్తిని తిట్టిన మోదీ

వెస్ట్ బెంగాల్ కు చెందిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యం కారణంగా మూడు రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నాడు. సోమవారం ఆయన కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఆదివారం హాస్పిటల్ లో ఉన్నప్పుడు ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నట్లు మీడియాకు చెప్పారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోనందుకు ప్రధాని ఆయన్ని తిట్టారని చెప్పారు.

ప్రస్తుతం తన హెల్త్ బాగానే ఉందని.. త్వరలోనే పూర్తిగా కోలుకొని మళ్లీ  షూటింగ్స్ కు వెళ్తానని ఆయన అన్నారు. ఇస్కీమిక్ సెరెబ్రోవాస్కులర్ కు మిథున్ చక్రవరి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఫిబ్రవరి 10న ఛాతి నొప్పితో అపోలో హాస్పటల్ లో చేరి.. నిన్న తిరిగి ఇంటికి వచ్చారు. మిథున్ చక్రవర్తి మాజీ రాజ్యసభ సభ్యుడు. బెస్ట్ విలన్ గా నేషనల్ అవార్డ్ పొందారు.