CSK vsMI: మళ్లీ నిరాశ పరిచిన రోహిత్.. 16వ సారి డకౌట్

CSK vsMI: మళ్లీ నిరాశ పరిచిన  రోహిత్.. 16వ సారి డకౌట్

రోహిత్ శర్మ ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిళ్లు అందించిన కెప్టెన్. అంతేగాకుండా అత్యధిక మ్యాన్ ఆఫ్ ధి మ్యాచ్ లు అందుకున్న ప్లేయర్ కూడా.   ముంబై సారథిగా సక్సెస్ అయినప్పటికీ ఆటగాడిగా విఫలమవుతున్నాడు.  ఈ ఐపీఎల్ లో రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఒకే ఒక్క హాఫ్ సెంచరీ సాధించాడు. అతని స్కోర్లు గమనిస్తే 1, 21, 65, 20, 28, 44, 2, 3, 0, 0తో దారుణంగా విఫలమయ్యాడు. పంజాబ్ తో జరిగిన  గత మ్యాచ్ లో డకౌట్ అయి చెత్త రికార్డ్ మూట గట్టుకున్న రోహిత్..  ఇవాళ(మే 6) చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్ లో మరోసారి డకౌట్ అయి నిరాశపరిచాడు.

దీపక్ చాహర్ బౌలింగ్ లో మూడు బంతులు ఆడి  పరుగులేమి చేయకుండానే పెవిలియన్ కు చేరాడు రోహిత్. అంతేగాకుండా ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. రోహిత్ ఇప్పటి వరకు 16 సార్లు ఔటయ్యాడు. రోహిత్ కంటే ముందు  దినేశ్ కార్తిక్‌(15), సునీల్ న‌రైన్‌(15), మ‌ణిదీప్ సింగ్ (15) లు కూడా ఈ జాబితాలో ఉన్నారు.

 చెన్నైతో జరుగుతోన్న  మ్యాచ్ లో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ముంబై ఇండియన్స్.  ప్రస్తుతం క్రీజులో  వాధేరా22, సూర్యకుమార్ యాదవ్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 9  ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్  59 పరుగులు చేసింది.