జగిత్యాలలో వింత వాతావరణం... ఒకవైపు ఎండ, మరోవైపు వాన... హైవేపై కూలిన భారీ వృక్షం...

జగిత్యాలలో వింత వాతావరణం... ఒకవైపు ఎండ, మరోవైపు వాన... హైవేపై కూలిన భారీ వృక్షం...

జగిత్యాల జిల్లా కోరుట్లలో వింత వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం కురిసింది. ఒకపక్క ఎండ, మరోపక్క వర్షం పడుతూ వింతగా మారింది వాతావరణం. ఒకపక్క ఎండ కొడుతూనే, వర్షం కురవడంతో బయట ఆహ్లాదకర వాతావరణం ఉన్నప్పటికీ ఇంట్లో వేడిగా ఉంటూ వింత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఏర్పడ్డ ఇంద్రధనస్సు అందరినీ అలరించింది.

ఇదిలా ఉండగా.. జగిత్యాల పట్టాన కేంద్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. జగిత్యాలతో పాటు పరిసర గ్రామాల్లో సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఆకాశంలో మేఘాలు కమ్ముకుని మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

కరీంనగర్ జగిత్యాల హైవేపై కూలిన భారీ వృక్షం:

ఇవాళ కురిసిన గాలి, వర్షానికి జగిత్యాల ప్రధాన రహదారిపై కొత్తపల్లి దేశరాజ్ పల్లి కెనాల్ దగ్గర భారీ వృక్షం కూలింది. దీంతో హైవేపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

►ALSO READ | కరీంనగర్ PMJ జువెలర్స్ దోపిడీ కేసు: చెట్ల పొదల్లో దొరికిన రెండు తుపాకులు..!