దొంగతనం చేసిన  ఇద్దరు మైనర్లు, వ్యక్తి అరెస్ట్

దొంగతనం చేసిన  ఇద్దరు మైనర్లు, వ్యక్తి అరెస్ట్

మియాపూర్, వెలుగు: ఇంటి తాళాలు పగులగొట్టి విదేశీ కరెన్సీని దొంగలించిన ఓ వ్యక్తితో పాటు ఇద్దరు మైనర్లను మియాపూర్​ పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపించారు. వారి వద్ద పలు దేశాలకు చెందిన లక్ష విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్​ డీఐ రమేశ్  తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్​ బీకే ఎన్​క్లేవ్​ ప్రజయ్​ షెల్టర్​లో ఉండే పి. శ్రీనివాసులరెడ్డి మలేషియా వెళ్లేందుకు పలు దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ తెచ్చుకొని పెట్టుకున్నాడు.

ఈ నెల 22న మెదక్​ వెళ్లగా, అదే రోజు రాత్రి ఐడీఏ బొల్లారంకు చెందిన తరుణ్(20), సెంట్రింగ్​ వర్క్​ చేసే బాలుడు(17), లేబర్​ పనిచేసే మరో బాలుడు(17)తో కలిసి శ్రీనివాసులురెడ్డి ఇంటి తాళాలు పగులగొట్టి విదేశీ కరెన్సీని దొంగలించారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకొని కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.