‘ఢీ’ షో డ్యాన్సర్ రాజుపై కేసు ఏంటి..? అసలేం జరిగింది..? రూ.12 లక్షల ముచ్చటేంది..?

‘ఢీ’ షో డ్యాన్సర్ రాజుపై కేసు ఏంటి..? అసలేం జరిగింది..? రూ.12 లక్షల ముచ్చటేంది..?
  • ప్రేమ, పెండ్లి పేరుతో డ్యాన్సర్​ మోసం
  • రూ.12 లక్షలు వసూలు చేశాడని యువతి ఫిర్యాదు
  • నిందితుడిని అరెస్ట్​ చేసిన మియాపూర్​ పోలీసులు

మియాపూర్, వెలుగు: ‘ఢీ’ షో డ్యాన్సర్ రాజుపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ప్రేమ, పెండ్లి పేరుతో మోసం చేశారంటూ యువతిని ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్​ గోకుల్​ ఫ్లాట్ అపార్ట్​మెంట్​ ఆరో ఫ్లోర్​లో ఓ యువతి(28) బొటిక్​ షాప్​ రన్​ చేస్తోంది. 

ఇదే బిల్డింగ్​లోని మూడో అంతస్తులో ఢీ షో ఫేమ్​చిట్టి మాస్టర్​ ‘చిట్టి డ్యాన్స్’​ స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఈ స్టూడియోలో డ్యాన్స్​ ప్రాక్టీస్​ చేయడానికి ఢీ షో సీజన్​ 10 విన్నర్​ రాజు ప్రతిరోజు వచ్చేవాడు.

ఒకే బిల్డింగ్​ కావడంతో రాజుకు సదరు యువతితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రాజు యువతిని ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ తర్వాత ఇద్దరు శారీరకంగా కలిశారు. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని డబ్బులు కావాలని అడగడంతో సదరు యువతి రాజుకు ఫోన్​పే ద్వారా పలుమార్లు రూ.12 లక్షల వరకు చెల్లించింది.

అయితే  పెండ్లి చేసుకోవాలని అడిగిన ప్రతిసారి రాజు సమాధానం చెప్పకపోవడంతో యువతి గట్టిగా నిలదీసింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె.. మియాపూర్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు రాజుపై కేసు నమోదు చేశారు. అరెస్ట్​ చేసిన అనంతరం రిమాండ్​కు తరలించారు.