జర్నలిస్టులు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి : ‘ది వైర్’ ఫౌండింగ్ ఎడిటర్ ఎం.కె.వేణు

జర్నలిస్టులు స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలి : ‘ది వైర్’ ఫౌండింగ్ ఎడిటర్ ఎం.కె.వేణు
  • ‘ది వైర్’ ఫౌండింగ్​ ఎడిటర్ ఎం.కె.వేణు 

బషీర్​బాగ్, వెలుగు: టెక్నాలజీకి అనుగుణంగా జర్నలిస్టులు తమ స్కిల్స్​ను అప్​డేట్​ చేసుకోవాలని స్వతంత్ర వార్తా సంస్థ ది వైర్ ఫౌండింగ్​ ఎడిటర్ ఎం.కె.వేణు సూచించారు. విజయవాడలో జరగనున్న ఐజేయూ జాతీయ ప్లీనరీని పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో టీయూడబ్ల్యూజే, మెఫీ సంయుక్తంగా నిర్వహించిన సోషల్ మీడియా ఇంపాక్ట్, పాజిటివ్, నెగెటివ్ ​సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. 

సోషల్ మీడియా విస్తృతి వల్ల ఒక వార్త క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తం అవుతోందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ సోమశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఐజేయూ మాజీ అధ్యక్షుడు డి.అమర్, టీయూడబ్ల్యూజే నేతలు విరాహత్ అలీ, రాంనారాయణ తదితరులు పాల్గొన్నారు.