
దరాబాద్, వెలుగు: ఈ బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ సర్కారు రైతు పక్షపాత ప్రభుత్వమని నిరూపితమైందని కాంగ్రెస్ దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్ అన్నారు. రైతు బిడ్డ సీఎం అయితే రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో రేవంత్ రెడ్డి నిరూపించారన్నారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. రైతులను అప్పులపాలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేన్నారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ప్రకటించారని, అందులో భాగంగా ఇప్పటికే రూ.లక్ష వరకు మాఫీ చేశామని చెప్పారు. గత ప్రభుత్వం చెట్లు, పుట్టలకు రైతు బంధు ఇచ్చి రూ.26 వేల కోట్లు దుర్వినియోగం చేసిందన్నారు. కానీ, తమ ప్రభుత్వం నిజమైన రైతులకే రైతు భరోసా స్కీమ్‌ను అమలు చేస్తుందని స్పష్టం చేశారు.