V6 News

మెడికల్ పీజీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తా :  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

మెడికల్ పీజీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తా :  ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల, వెలుగు: గద్వాలలో మెడికల్ పీజీ కాలేజ్ ఏర్పాటు కోసం కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. సోమవారం 130 కోట్ల తో నిర్మించనున్న మెడికల్ కాలేజీ వసతి గృహానికి భూమి పూజ చేశారు. అనంతరం నూతన క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి తో మెడికల్ కాలేజీకి భూమి పూజ చేయించనున్నట్లు తెలిపారు. అనంతరం మల్దకల్ మండల పరిధిలోని నీలిపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.