- ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
ఘట్ కేసర్, వెలుగు: విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి కష్టపడి చదివాలని స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సూచించారు. పోచారం డివిజన్ కొర్రెముల జడ్పీ స్కూల్లో బైనగారి నరేశ్ సహకారంతో నిర్మించిన డైనింగ్ హాల్ ను మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ప్రపంచంలోనే ఏదైనా సాధించగలమన్నారు.
అనంతరం మక్తాలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జైనగారి నాగభూషణం, మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేశ్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ బొడ్డు వినోద నాగార్జున్ పాల్గొన్నారు.
