మెదక్, టౌన్, వెలుగు: మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి చేసింది శూన్యమని బీజేపీ మెదక్ జిల్లా ప్రెసిడెంట్ గడ్డం శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మెదక్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందుకు జిల్లాకు ఆమె ఇచ్చిన ముఖ్యమైన 16 హామీలు మరిచిపోయారన్నారు. తొమ్మిదేండ్లలో మెదక్‌ను ఏ విధంగా ఎమ్మెల్యే అభివృద్ధి చేయలేకపోయారని తెలిపారు.
సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్ధన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల విజయ్ కుమార్, బానప్ప గారి సుధాకర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మధు, జిల్లా మహిళా మోర్చా ప్రెసిడెంట్ బెండె వీణ, మెదక్ టౌన్, మండల అధ్యక్షులు ప్రసాద్, రవి గౌడ్, రంజిత్ రెడ్డి, సంతోష్ చారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బక్క వారి శివ, లోకేశ్, రాజు, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.