బ్యాంకు అధికారులకు ఎమ్మెల్యే దానం బెదిరింపులు

V6 Velugu Posted on Jul 27, 2020

ఖైరతాబాద్ లోని  స్థలం విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ ప్రైవేట్ బ్యాంకు అధికారులను బెదిరించిన తీరు వివాదాస్పదమైంది..2010 లో ఖైరతాబాద్ లోని ఓ ఖాళీ ప్రదేశంపై హైదరాబాద్ కు చెందిన కావూరి సాంబశివరాలు ఓ ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకుని కట్టలేదు. డిఫాల్ట్ అవడంతో సంబంధిత బ్యాంక్ ఆ స్థలాన్నే వేలానికి పెట్టింది. ఆదివారం నిర్వహించిన వేలంలో ఆ ప్లేసును వేరే వ్యక్తికి బ్యాంక్ వాళ్లు కేటాయించారు. ఆ టైంలోనే అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే దానం అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. ప్రకటన ఇవ్వకుండానే ఎలా వేలానికి పెడతారంటూ ఆయన ఫైర్ అయ్యారు. స్థలం తమకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని వాళ్లను బెదిరించారు. ఎమ్మెల్యే బెదిరించడంతో అధికారులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Tagged EMPLOYEE, warning, Bank, Khairathabad, Danama nagendar

Latest Videos

Subscribe Now

More News