దేవుడే సీఎం కేసీఆర్​ రూపంలో వచ్చాడు : దానం నాగేందర్

దేవుడే సీఎం కేసీఆర్​ రూపంలో వచ్చాడు : దానం నాగేందర్

తెలంగాణ రాష్ట్రంలో పేదలకు సహాయం చేయడానికి దేవుడే సీఎం కేసీఆర్ రూపంలో వచ్చాడని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఎర్రమంజిల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన క్రిస్మస్ కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదరీమణులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గిఫ్ట్స్ పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని పాస్టర్, క్రిస్టియన్ సోదర సోదరీమణులు ప్రార్థనలు నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో అందించే ప్రతి సంక్షేమ పథకం సీఎం కేసీఆర్ అందిస్తున్నదేనని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే వారధి వలే పని చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి .. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సీఎం కేసీఆర్ ని కలుస్తున్నారని చెప్పారు. ఎల్.బి. స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు.