లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్

లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్

ప్రభుత్వం అందిస్తున్న పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. దళారులను నమ్మి డబ్బులు ఇవ్వవద్దని.. ఎవరైనా డబ్బులు అడిగితే తనకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర కాలనీ డివిజన్‭లోని బంజారా భవన్‭లో జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. దాదాపు 2వేల మంది లబ్ధిదారులకు పెన్షన్ చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో దానం నాగేందర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ మన్నె కవితరెడ్డి పాల్గొన్నారు. 

సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల పేద ప్రజలకు లబ్ధి చేకూరుతుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. మరికొద్ది రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా లబ్ధిదారులకు దళితబంధు ఇవ్వనున్నామని.. విడతల వారీగా అందరికి అందజేస్తామని చెప్పారు.