డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్ల స్కీమ్​పై తీవ్ర నిర్లక్ష్యం : ధన్​పాల్​ సూర్యనారాయణ

డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్ల స్కీమ్​పై తీవ్ర నిర్లక్ష్యం : ధన్​పాల్​ సూర్యనారాయణ

​నిజామాబాద్​అర్బన్, వెలుగు: సిటీలో డబుల్​బెడ్​రూమ్​ఇండ్ల స్కీమ్​పై గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ ఆరోపించారు. సిటీలోని బీజేపీ ఆఫీస్​లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అర్బన్​నియోజకవర్గానికి 2,330 డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు మంజూరు చేసిన గత ప్రభుత్వం, కేవలం 648 ఇండ్లను మాత్రమే నిర్మించిందని, వీటిలో సగానికి పైగా ఇండ్లు పంపిణీకి నోచుకోలేదన్నారు. ఇండ్ల పంపిణీలోనూ పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని, బీఆర్ఎస్ ​లీడర్లు డబ్బులు తీసుకొని పంచిపెట్టారన్నారు.

 సిటీలో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీని కూడా గాలికొదిలేయగా, కేంద్ర ప్రభుత్వం అమృత్2.0 పథకంలో డ్రైనేజీకి రూ.162 కోట్లు, తాగునీటి సరఫరాకు రూ. 217 కోట్లను మంజూరు చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని జిల్లా ఇన్​చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయలని డిమాండ్​ చేశారు. సమావేశంలో లీడర్లు లక్ష్మీనారాయణ, స్రవంతిరెడ్డి, శంకర్, వీరేందర్​ పాల్గొన్నారు.