స్టూడెంట్స్కు యూనిఫామ్స్ పంపిణీ

స్టూడెంట్స్కు యూనిఫామ్స్ పంపిణీ

సత్తుపల్లి, వెలుగు : రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా సత్తుపల్లి లో రెండు వేల మంది జూనియర్, డిగ్రీ విద్యార్థులకు యూనిఫామ్స్, నోట్ బుక్స్  పంపిణీ చేశామని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి తెలిపారు. శుక్రవారం స్థానిక జేబీఆర్​ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో యూనిఫామ్స్, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్​ఎన్. 

గోపి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను ప్రోత్సహిస్తూ విద్యార్థుల అవసరాలను సమకూరుస్తున్న ఎమ్మెల్యే మట్టా దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ అధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ,  కళాశాల వైస్ ప్రిన్సిపాల్ షేక్ పీర్ సాహెబ్,  కాంగ్రెస్ నాయకులు దోమ ఆనంద్, గాదె చెన్నారావు, శివ వేణు, చల్లగుల్ల నరసింహా రావు, కమల్ పాషా, గ్రాండ్ మౌలాలి, దూదిపాల్ల రాంబాబు పాల్గొన్నారు.

ఘనంగా మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే

మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు శుక్రవారం పట్టణంలోని బస్టాండ్ రింగ్ సెంటర్​లో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మట్టా రాగమాయి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.  మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో కూడా వేడుకలు నిర్వహించారు.