చిట్యాల, వెలుగు : భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బావుసింగ్ పల్లి, జూకల్ గ్రామాల్లో రూ.4.16 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు గడపగడపకూ అందేలా కృషి చేస్తామన్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ హేమ, ఇన్చార్జి ఎంపీడీవో రామకృష్ణ, పీఆర్డీ ఈ వెంకటేశ్వర్లు, ఏఈ అరుణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గూట్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బావుసింగ్‌పల్లిలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న గుంటుకు స్వప్న డీఎస్సీ–2024 ఎస్జీటీ టీచర్‌గా ఎంపిక కావడంతో, ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా ఆమెను సన్మానించి, స్వీట్లు తినిపించారు.