తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

తాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

పద్మారావునగర్, వెలుగు : కంటోన్మెంట్​పరిధిలోని వార్డు- నంబర్​2 రసూల్‌పురా కట్ట మైసమ్మ ఆలయ ప్రాంతంలో తాగునీటి సమస్యను ఎమ్మెల్యే శ్రీగణేశ్​పరిష్కరించారు. ఇంతకుముందు నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా బస్తీ పర్యటన చేయగా, తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వ నిధులతో గురువారం కొత్త పవర్ బోర్​వెల్ ఏర్పాటు చేయించారు. కంటోన్మెంట్ చీఫ్ ఇంజినీర్ ఉమాశంకర్, రసూల్‌పుర ఏరియా ఇంజినీర్ కేకే రెడ్డి పాల్గొన్నారు.---