పాలన చేతకాకపోతే దిగిపోవాలి.. అప్పు పుట్టడం లేదని మాట్లాడడం సీఎంగా ఫెయిల్‌‌‌‌ అయినట్లే: ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

పాలన చేతకాకపోతే దిగిపోవాలి.. అప్పు పుట్టడం లేదని మాట్లాడడం సీఎంగా ఫెయిల్‌‌‌‌ అయినట్లే: ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు

సిద్దిపేట రూరల్, వెలుగు : రేవంత్‌‌‌‌రెడ్డికి పాలన చేతకాకపోతే దిగిపోవాలని, అప్పు పుట్టడం లేదని చెప్పడంతో ఆయన సీఎంగా ఫెయిల్‌‌‌‌ అయినట్లేనని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌రావు విమర్శించారు. సిద్దిపేట రూరల్‌‌‌‌ మండలం ఇరుకోడులోని ఐకేపీ సెంటర్‌‌‌‌లో తడిసిన, మొలకెత్తిన వడ్లను ఆయన పరిశీలించారు. కలెక్టర్‌‌‌‌, ఆర్డీవో, సివిల్‌‌‌‌ సప్లై ఆఫీసర్లతో మాట్లాడి వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందాల పోటీలపై రివ్యూలు పెట్టడం మానేసి.. అన్నదాతలను కాపాడుకోవాలని చెప్పారు. 

వడ్ల కొనుగోలులో కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నీ బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదన్నారు. పాకిస్థాన్‌‌‌‌ ప్రేరేపిత టెర్రరిస్టుల మీద దాడి చేసి మన సైన్యం గట్టిగా బుద్ధి చెప్పిందన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్‌‌‌‌ రవీందర్‌‌‌‌రెడ్డి, మాజీ సర్పంచ్‌‌‌‌ శాతరాజుపల్లి ఆంజనేయులు, ఆకుల హరీశ్, స్వామి, సత్య నారాయణ, కడవేరుగు రాజనర్సు, ప్రభాకర్‌‌‌‌వర్మ పాల్గొన్నారు.