
దుబ్బాక: ‘బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలది ఢిల్లీలో దోస్తనం.. గల్లీ లో కొట్లాట’ అని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం నాడు దుబ్బాకలో మాట్లాడుతూ.. టీఆర్ఎస్, బీజేపీ లని ప్రజలు నమ్మొద్దని అన్నారు. బీజేపీ అభ్యర్ధి రఘునందన్, మంత్రి హరీష్ రావు అన్నదమ్ములని.. ఉద్యమం సమయంలో హరీష్, రఘునందన్ దందా లు చేసే వాళ్ళని, ఒకరి దందాలు మరికరి తెలుసని అన్నారు. తెలంగాణ బీజేపీ నేతలు డమ్మీ నేతలని..TRS ప్రభుత్వం వారిని కొడితే దిక్కులేదని అన్నారు. దుబ్బాక లో ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి చూసి ఆయన కొడుక్కు ఓటు వేయండని, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలను నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేయండని జగ్గారెడ్డి అన్నారు.