స్టూడెంట్స్ కు భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

స్టూడెంట్స్ కు భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

అన్నపురెడ్డిపల్లి, వెలుగు : స్టూడెంట్స్ కు అందించే భోజనంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ  టీచర్లను, భోజన నిర్వాహకులను హెచ్చరించారు. శుక్రవారం అన్నపురెడ్డిపల్లి లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్ల కోసం వండిన భోజనాన్ని రుచి చూశారు.

  భోజనం, వసతులు ఎలా ఉన్నాయని స్టూడెంట్స్ ను ఆరా తీశారు. ఆహార నాణ్యత, శుభ్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. రెసిడెన్షియల్ లో  మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట నాయకులు పర్సా వెంకటేశ్వర్లు, టీచర్లు, సిబ్బంది ఉన్నారు.

సీఎంఆర్ చెక్కులు పంపిణీ

ములకలపల్లి, వెలుగు : స్థానిక రైతు వేదికలో శుక్రవారం 31 మందికి మంజూరైన రూ.8.87 లక్షల సీఎంఆర్ ఎఫ్​ చెక్కులను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ రావు, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.