ధర్మసాగర్/ మొగుళ్లపల్లి, వెలుగు : వ్యవసాయాన్ని పండుగ చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని స్టేషన్‌ఘన్‌పూర్, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లిలో ఎమ్మెల్యే కడియం సీసీ రోడ్డు, ఇందిరమ్మ ఇల్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంతోపాటు ములకలపల్లి, మొట్లపల్లి, మెట్టుపల్లి, ఇస్సిపేట, రంగాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర ఓపెన్ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని రైతు వేదికలో 69 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.

