తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్యే కడియం సెటైర్లు

 తాటికొండ రాజయ్యపై ఎమ్మెల్యే కడియం సెటైర్లు

మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సెటైర్లు వేశారు.  కొందరు రాజకీయాలను పూర్తిగా మార్చేసారని..   పథకాలు, పనులు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేశారని అన్నారు.  రాజకీయాలు అంటే ఎగిరి దునకడం, అందినకాడికి దోచుకోవడమే లక్ష్యంగా పనిచేశారంటూ విమర్శించారు.  మడికొండలో  వరంగల్ ఎంపీగా గెలిచిన  కడియం కావ్యకు పరిచయం, ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది.  

తాను న్యాయం కోసం మాత్రమే పనిచేస్తానని,  భూకబ్జాలకి పోనని.. కార్యకర్తల దగ్గర లంచం తీసుకొనని చెప్పారు కడియం శ్రీహరి.  ఏ పథకం ఇచ్చినా, పని ఇచ్చినా రూపాయి ఆశించానని చెప్పారు.  తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే చర్యలు తీసుకుంటానన్నారు కడియం.  తన  ఎజెండా అవినీతిరహిత పాలన అందించడమే మాత్రమేనని అన్నారు.  భూ అక్రమార్కులను తన వద్దకు ఎవరూ తీసుకురావద్దంటూ కార్యకర్తలకు సూచించారు.  

కడియం శ్రీహరి, కడియం కావ్య పనిచేసి మంచిపేరు తెచ్చునేలా ఉండాలన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో ఇందిర, కడియం వర్గమని మాట్లాడితే వాళ్ల తోకలు కత్తిరిస్తామని హెచ్చరించారు కడియం.  ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.  అనవసర తగాదాలు, ఈగోలు పక్కనపెట్టాలని కార్యకర్తలకు సూచించారు.  పనిలో పోటీ పడుదాం, కూర్చునే కుర్చీకోసం కాదని చెప్పారు.