చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంటం : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్

చైర్ పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకుంటం : నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్
  •     కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ ఉంది
  •     నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్ 

ఖానాపూర్, వెలుగు: ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పీఠాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయామని నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఖానాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ కు కావాల్సిన పూర్తిస్థాయి కోరం కాంగ్రెస్ వద్ద ఉందన్నారు. 

ఎన్నిక ముగియగానే పట్టణాభివృద్ధి పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గంలోని పలు ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సమావేశంలో కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు దయానంద్, రమేశ్, మున్సిపల్ మాజీ చైర్​పర్సన్ సత్యం, ఆత్మ చైర్మన్ సత్యం, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. 

ఈ నెల 4న నిర్మల్ కు పీసీసీ చీఫ్ రాక

ఈ నెల 4న నిర్మల్ పట్టణానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వస్తున్నట్లు బొజ్జు పటేల్ తెలిపారు. ఓ హోటల్ లో జరిగే డీసీసీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశానికి డీసీసీ కార్యవర్గ సభ్యులతో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరు కావాలని బొజ్జు పటేల్​కోరారు.