రవాణా శాఖ ఆదాయం రూ. 7097 కోట్లు... గత ఏడాదితో పోల్చితే 2.70 శాతం వృద్ధి రేటు

రవాణా శాఖ ఆదాయం రూ. 7097 కోట్లు... గత ఏడాదితో పోల్చితే 2.70 శాతం వృద్ధి రేటు

హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.7,097.38 కోట్ల ఆదాయాన్ని అర్జించినట్టు ఆ శాఖ అధికారులు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం (2024–25)తో పోల్చితే ఆదాయంలో 2.70 శాతం వృద్ధి నమోదైనట్టు తెలిపారు. పర్యావరణ హితమైన రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) భారీగా పన్ను మినహాయింపులు ఇచ్చింది. 2025–26 లో మొత్తం 91,637 ఎలక్ట్రిక్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయి. వీటికి ప్రభుత్వం రూ.769.81 కోట్ల పన్ను మినహాయింపు కల్పించినట్టు అధికారులు స్పష్టం చేశారు.