- అటవీ రక్షణలో వీరిది కీలక పాత్ర
- జన్నారం డివిజన్ లో 12 క్యాంపుల్లో 60 మంది
- గ్రామీణ యువతకు ఉపాధి
- 24 గంటలు అడవికి కాపలా కాస్తున్న సిబ్బంది
జన్నారం రూరల్, వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పని చేస్తున్న బేస్ క్యాంప్ సిబ్బంది అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణలో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అక్రమ వేట, పోచింగ్‌ను అరికట్టడంలో కీలకంగా మారుతున్నారు. అటవీ సంరక్షణ కోసం అధికారులు తొలుత 10 క్యాంపులను ఏర్పాటు చేయగా .. మెరుగైన ఫలితాలు రావడంతో 12కు పెంచారు. భవిష్యత్తులో క్యాంపులను 15కు పెంచే అవకాశం కూడా ఉంది. నెలకు వందల కిలోమీటర్ల ఫూట్ పెట్రోలింగ్ చేస్తూ అడవి నాశనాన్ని, అక్రమ వేటను అడ్డుకుంటున్న వీరి కృషి వల్ల గత ఏడేండ్లలో కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో వన్యప్రాణుల సంఖ్య మెరుగుపడింది. మహారాష్ట్ర నుంచి వచ్చే పులుల కదలికలను గుర్తించి, వాటి ట్రాన్స్‌లొకేషన్‌కు సహకరించడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఈ సిబ్బంది.. సేకరించే సమాచారం ఫారెస్ట్ అధికారులకు కీలకమవుతోంది.
అడవిని కాపాడటంలో కీలకం..
అడవిలో అగ్ని ప్రమాదాల నివారణ, వన్యప్రాణుల దాడుల నియంత్రణ, అక్రమ కలప తరలింపు అరికట్టడంలో బేస్ క్యాంప్ సిబ్బంది కృషి ఉంది. రాత్రి వేళ కలప తరలిపోకుండా అడవిలో బేస్‌క్యాంపు సిబ్బంది కాపలాకాస్తున్నారు. పెట్రోలింగ్ లో కూడ వీరి సేవలను అధికారులు వినియోగించుకుంటున్నారు. సంవత్సరం కాలంలో సుమారుగా రూ. 10 లక్షల విలువైన కలపను అటవీ అధికారులతో కలిసి పట్టుకున్నారు. గ్రామాల రీలొకేషన్ ద్వారా పులులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంలో, అటవీ సంపదను కాపాడేందుకు గ్రామాల్లో కల్పించే అవగాహన కార్యక్రమాల్లోనే సిబ్బంది సహాయం చేస్తారు. వీరి పనితో పులుల ట్రాన్స్‌లొకేషన్ , మానిటరింగ్ లోనూ మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.
ఫీల్డ్ డ్యూటీలో ఉంటూ..
బేస్ క్యాంప్ సిబ్బంది ప్రధానంగా ఫీల్డ్ డ్యూటీ నిర్వహిస్తారు. రోజుకు ఒక్కొక్కరు 10 కిలోమీటర్ల వరకూ ఫూట్ పెట్రోలింగ్ చేసి, అక్రమ వేట, అగ్ని ప్రమాదాలను పసిగడుతున్నారు. - జన్నారం డివిజన్‌లోని పాలఘోరిలో అక్రమణకు గురి కాకుండా బేస్ క్యాంప్ సిబ్బంది రాత్రి పగలు అక్కడే డ్యూటీలో ఉంటున్నారు. తాళ్లపేట రేంజ్ దమ్మన్న పేటలో అక్రమదారులను వెళ్లేగొట్టే క్రమంలో వారు దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి పాదముద్రలు, కదలికలను గుర్తించడంలో అటవి అధికారులతో కలిసి పని చేశారు.
జన్నారం డివిజన్‌లోని ఇందన్‌పల్లి, కిష్టాపూర్, మల్యాల, అలీనగర్ అటవి బీట్‌లో పులి రాకపోకలు కొనసాగించగా.. ఆ పులి సంరక్షణకు సిబ్బంది కృషి చేశారు. దాన్ని ట్రాక్ చేసి ఎప్పటికప్పుడూ అధికారులకు సమచారం చేరవేశారు. బేస్‌క్యాంపు సిబ్బందిలో కొందరిని ఎనిమల్ ట్రాకర్లుగా , టైగర్ మానిటరింగ్ సిబ్బందిగా కూడా శిక్షణ ఇచ్చి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుంటోంది. పులి కదలికలను, ఎప్పటికప్పుడు వారు పరిశీలించి అధికారులకు తెలియజేస్తారు.
నిత్యంకంటికిరెప్పలా..
వందల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ అటవీ ప్రాంత రక్షణ ఫారెస్ట్ అధికారులకే కత్తిమీద సాములాంటిది కాగా.. బేస్ క్యాంప్ సిబ్బంది నిరంతరం అడవికి కాపలా కాస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు గస్తీ కాస్తుంటారు. పోచర్లను అరికట్టడం, ఎలక్ట్రిక్ ట్రాప్స్ ను గుర్తించి , వణ్యప్రాణుల ప్రాణాలను కాపడుతున్నారు. వేటగాళ్లు వన్య ప్రాణుల కోసం నీటికుంటల వద్ద ఉచ్చులు పెట్టే ప్రమాదం ఉంది. వాటిని ఎప్పటికప్పుడూ వాటిని తొలగిస్తుంటారు.
అలాగే జంతువుల కోసం నీటికుంటను మెరుగుపరచడం, అడవి అభివృద్ధి పనులు చేయడంలో వీరి పాత్ర ప్రధానంగా ఉంది.
బేస్‌క్యాంపు సిబ్బందిని ప్రైవేట్‌సంస్థ ద్వారా రిక్రూట్ చేసుకొని అటవీ శాఖకు అప్పగించారు. ఒక్కొక్కరికి రూ.12,046 వేతనం, రూ.3,380 ఫుడ్ అలవెన్స్‌అందజేస్తారు. రూ.900 ఈపీఎఫ్ ఇతరాలు పోను కంపా నుంచి సుమారుగా రూ.14,526 వరకు వీరికి చెల్లిస్తారు. గత మూడేళ్ల నుంచి వేతనాలు నెలనెలా కాకుండా మూడు నెలలకు ఒక్కసారి వస్తున్నట్లు బేస్‌క్యాంపు సిబ్బంది పేర్కొంటున్నారు.
అరకొర జీతాలే...
బేస్‌క్యాంపు సిబ్బందిని ప్రైవేట్‌సంస్థ ద్వారా రిక్రూట్ చేసుకొని అటవీ శాఖకు అప్పగించారు. ఒక్కొక్కరికి రూ.12,046 వేతనం, రూ.3,380 ఫుడ్ అలవెన్స్‌అందజేస్తారు. రూ.900 ఈపీఎఫ్ ఇతరాలు పోను కంపా నుంచి సుమారుగా రూ.14,526 వరకు వీరికి చెల్లిస్తారు. గత మూడేళ్ల నుంచి వేతనాలు నెలనెలా కాకుండా మూడు నెలలకు ఒక్కసారి వస్తున్నట్లు బేస్‌క్యాంపు సిబ్బంది పేర్కొంటున్నారు.
60 మంది పనిచేస్తున్నారు
జన్నారం ఫారెస్ట్ డివిజన్‌లో 12 బేస్‌క్యాంపులలో 60 మంది సిబ్బంది ఉన్నారు. అవసరాన్ని బట్టి వారి సేవలను వినియోగించుకుంటాం. అడవిలో ఉంటూ గస్తీ తిరుగడంతో పాటుగా ఒక్కోసారి పెట్రోలింగ్, రైడ్‌లలో పాల్గొంటారు. అవసరాన్ని బట్టి 15 క్యాంపులను పెంచి అదే సిబ్బందితో అడ్జెస్ట్ చేస్తున్నాం.
- రామ్మోహన్, జన్నారం ఎఫ్‌డీవో
ఉపాధి లభిస్తుంది..
నేను ఐదేళ్ల కిందట బేస్‌క్యాంపులో చేరాను. అధికారుల సూచన మేరకు పనిచేస్తున్నాను. అటవీ అధికారులతో కలిసి టైగర్‌మానిటరింగ్, పెట్రోలింగ్‌తో పాటు అడవిలో తిరుగుతాను. గత నాలుగు సంవత్సరాలుగా అటవీ శాఖ అధికారుల వల్ల ఉపాధి అవకాశం లభించింది. - భూక్య సుమన్
