రైతులు దళారీల మాటలు నమ్మి మోసపోవద్దు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

రైతులు దళారీల మాటలు నమ్మి మోసపోవద్దు :  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి
  •     ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు, వెలుగు  : రైతులు దళారీల మాటలు నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన కడ్తాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని, ముద్విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో   కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అండగా ఉండటమే ప్రభుత్వ లక్ష్యమని, నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి గిట్టుబాటు ధరతో పాటు సన్న రకాలకు ఇచ్చే బోనస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా పొందాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ గీత, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్ పాల్గొన్నారు.