సీఎంపై వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శవయాత్ర

సీఎంపై వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శవయాత్ర
  • దిష్టిబొమ్మ దహనం  

శంషాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శంషాబాద్ బస్టాండ్ వద్ద ఆదివారం రంగారెడ్డి జిల్లా ఎన్ఎస్ యూఐ యువజన విభాగం అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూరాబాద్​బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర నిర్వహించారు. తర్వాత కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.  కౌశిక్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సీఎంకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు.