ప్రతీ గ్రామానికి కనీసం రూ. కోటి ఇయ్యాలె

ప్రతీ గ్రామానికి కనీసం రూ. కోటి ఇయ్యాలె

యాదాద్రి భువనగిరి జిల్లా: సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసేదేమీలేదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గురువారం ఆయన ఆత్మకూరు మండలకేంద్రంలో ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి..  తెలంగాణలో నిజమైన ఉద్యమ కారులకు కేసీఆర్ ఏమీ చేయలేదన్నారు. ఈ రోజు ప్రజాసంక్షేమ పథకాలు అందుతున్నాయంటే మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే అన్నారు. కేసీఆర్ రెండోసారి రుణమాఫీ చేయలేదని.. చాలా మందికి ఇంకా మొదటి రుణమాఫీ కూడా అందలేదన్నారు. కొడుకును ఎట్లా ముఖ్యమంత్రిని చేయాలి.. డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి అనే ఇంట్రెస్ట్ కేసీఆర్ కు ప్రజలపై లేదన్నారు.

సీమాంద్ర కాంట్రాక్టర్లలకు ఎలా దోచి పెట్టి కమీషన్ తీసుకోవాలని చూస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రశ్నించే గొంతులను నొక్కుతుండని..ఒక రాజును అని నియంతలాగా కేసీఆర్ వ్యవహారిస్తున్నారన్నారు. తప్పులు చేస్తున్నావ్ కాబట్టే దేవుడిని మొక్కుతున్నావ్. కానీ నీమీద దేవుడికి నమ్మకం లేదన్నారు. నువ్వు మొక్కే లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్న యాదగిరిగుట్టలనే ప్రజాతీర్పు నీకు వ్యతిరేకంగా వచ్చిదన్న కోమటిరెడ్డి.. దొంగదారిలో చైర్మైన్ ని చేసుకున్నావన్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే కేసీఆర్ గొప్పతనం కాదని.. మా లోని లోపం కాంగ్రెస్ పార్టీ పొత్తులవల్ల ఓడిపోయామన్నారు.

వాసాలమర్రి గ్రామానికి రూ.100 కోట్లు ఇస్తానన్నాడట. అదే ఆలేరు నియోజకవర్గoలో వంద గ్రామాలకు ఇవ్వాలని.. కోటి లెక్క అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పిచ్చోడి చేతిలో రాయి అలిబాబా అరడజను దొంగలు లెక్క టీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. గ్రామానికి కోటి రూపాయలు నిధులు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్టాన్ని రూ. 3లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడన్నారు. త్వరలోనే కేసీఆర్ ను గద్దె దించడానికి మరో ఉద్యమం చేపడుతామన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.