ఉమ్మడి నల్గొండను కరువు జిల్లాగా ప్రకటించాలి : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

ఉమ్మడి నల్గొండను కరువు జిల్లాగా ప్రకటించాలి : కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి

ముంపునకు గురయ్యే మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదన్నారు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. శుక్రవారం నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన ..శివన్న గూడెం, కృష్ణoపల్లి ప్రజలకు కూడా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు అందించిన ప్యాకేజీ అందించాలన్నారు.

నల్గొండ, యాదాద్రి జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించాలని తెలిపారు. మూసికి 100కోట్లు కేటాయిస్తే ఉమ్మడి నల్గొండ సస్యశ్యామలం అవుతుందన్న కోమటిరెడ్డి..సభలో భట్టి విక్రమార్కను మాట్లాడనీయక పోవడం బాధాకరమన్నారు.